: వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనివ్వడానికి వెనక్కి తగ్గే రోజులు పోయాయి: కేసీఆర్
తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లనివ్వడానికి వెనక్కి తగ్గే రోజులు పోయాయని, వ్యవసాయం అంటే ఏమిటో గత రెండు సంవత్సరాలు చేసి చూపించామని, త్వరలోనే వ్యవసాయ శాఖలో 500 పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని కొంపల్లి గార్డెన్స్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో గొల్ల, కురుమ కులస్తులను ధనవంతులను చేస్తామని, బెస్త, ముదిరాజ్ లకు చేపలు పంపిణీ చేస్తున్నామని, మత్స్య పరిశ్రమను ఏడాదికి 5 వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానం చేశారు.