: భారత టెక్కీల సామర్థ్యాలకు తిరుగులేదు: ఐటీ ఇండస్ట్రీ ప్రముఖుడు మోహన్ దాస్ పాయ్


భారతదేశానికి చెందిన ఇంజనీర్లలో తొంభై ఐదు శాతం మంది సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఉద్యోగాలకు పనికిరారంటూ ‘యాస్పైరింగ్ మైండ్స్’ తన అధ్యయనం ద్వారా ప్రకటించిన విషయం విదితమే. ఈ అధ్యయనంపై ఐటీ ఇండస్ట్రీ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సంస్థ బోర్డు డైరెక్టర్ల బృందం మాజీ సభ్యుడు టీవీ మోహన్ దాస్ పాయ్ మండిపడ్డారు. అదో చెత్త అధ్యయనమని, భారత టెక్కీల సామర్థ్యాలకు తిరుగులేదని పాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. భారత్ కు చెందిన ఐటీ నిపుణుల సామర్థ్యాలపై ఆయన తన విశ్వాసం వ్యక్తం చేశారు. మన ఇంజనీర్లలో అరవై నుంచి అరవై ఐదు శాతం మందికి ట్రైనింగ్ లేదనే విషయాన్ని ఆయన ఖండించారు. కాగా, పాయ్ ట్వీట్ కు తాను మద్దతు తెలుపుతున్నానని మరో వ్యాపార దిగ్గజం కిరణ్ మజుందర్ షా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News