: హోరాహోరీ పోరుతో అభిమానులను అలరించిన పంజాబ్, ముంబై


ఐపీఎల్ సీజన్ 10లో 22వ మ్యాచ్ అభిమానులకు పసందైన క్రికెట్ విందును పంచింది. ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బ్యాట్స్ మన్ జూలు విదిల్చి భారీ స్కోర్లు చేశారు. బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని కేరింతల్లో ముంచెత్తారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కు హషీమ్ ఆమ్లా (102), షాన్ మార్ష్ (26) శుభారంభం ఇచ్చారు. షాన్ మార్ష్ అవుటైన తరువాత ఆమ్లా వేగం పుంజుకున్నాడు. ధాటిగా ఆడుతూ ఈ సీజన్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. అతనికి మ్యాక్స్ వెల్ జతకలిశాడు దీంతో 'నువ్వు, ఫోర్ కొడితే, నేను సిక్సర్ కొడతా' అన్నట్టు ఇన్నింగ్స్ సాగింది.

దీంతో ఈ మ్యాచ్ లో పంజాబ్  4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఇందులో సగం హషీమ్ ఆమ్లా చేయడం విశేషం. తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబైకి పార్థివ్ పటేల్ (37), జోస్ బట్లర్ (77) శుభారంభం చేశారు. జోస్ బట్లర్ వీరవిహారం చేశాడు. బౌండరీలు ఫోర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం నితీష్ రాణా (62) విరుచుకుపడ్డాడు. దీంతో ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఈ సీజన్ లో వరుసగా ఐదో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. 

  • Loading...

More Telugu News