: సగానికి పైగా బరువు తగ్గిపోయిన ఎమన్ అహ్మద్!
ప్రపంచంలోనే అత్యధిక బరువు గల మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఎమన్ అహ్మద్‌కు ముంబయిలో చికిత్స అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ఏకంగా 250 కేజీల బరువు తగ్గారు. ఆమె భారత్‌కు చేరుకునే సమయంలో దాదాపు 500 కేజీలకు పైగా బరువు ఉండేది. ఆమెను ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానంలో అతికష్టం మీద తీసుకొచ్చారు. ముంబయిలోని సైఫీ ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించారు. ఇన్నాళ్లూ మంచానికే అతుక్కుపోయి కనిపించిన ఆమె ఇప్పుడు వీల్‌ఛైర్‌లో కూర్చుంటున్నారు. మూడు నెలల క్రితం తాము సైతం ఆమె ఇంతలా తగ్గుతుందని అనుకోలేదని వైద్యులు తెలిపారు. ఆమెకు ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతోందని చెప్పారు.