: మద్యం షాపులను ధ్వంసం చేసిన మహిళలు
తమ కుటుంబాలను నాశనం చేస్తోన్న మద్యపానానికి వ్యతిరేకంగా మహిళామణులంతా చైతన్యవంతులై వైన్ షాపులపై దాడులకు దిగిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. మద్యపానంపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రోడ్లెక్కిన మహిళలు మద్యం షాపుల ముందు నిరసనలు తెలిపారు. పలు ప్రాంతాల్లో మద్యం షాపుల అద్దాలు పగులగొట్టి, వాటిల్లోని మద్యం సీసాలపై రాళ్లురువ్వారు. మహిళల ఆందోళనతో కొన్ని మద్యం షాపులు తాళాలతో కనిపించాయి.