: బద్రి సినిమా విడుదలై నేటికి 17 ఏళ్లు.. నాటి విషాద సంఘటన బాధను ఆపుకోవడం నా వల్ల కాలేదు: రేణు దేశాయ్


ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కలిసి నటించిన బ‌ద్రీ సినిమా భారీ విజ‌యాన్ని అందుకొని అప్ప‌ట్లో వారిద్ద‌రికీ మంచి గుర్తింపు తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుద‌లై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్భంగా రేణు దేశాయ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆ నాడు జ‌రిగిన ఓ చేదు జ్ఞాప‌కాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురైంది. బద్రి సినిమాకు సంబంధించిన ఓ సీన్‌ను షూట్ చేస్తోన్న స‌మ‌యంలో త‌న‌కు పుణే నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, అది ఓ విషాద వార్త‌ అని, అది విని ఏడ్చేశాన‌ని తెలిపింది. తీవ్ర విషాదంలో ఉన్న‌ప్ప‌టికీ, షూటింగ్ జరుగుతుండటం వల్ల ఆ వార్తను మనసులోనే దాచుకొన్నాన‌ని తెలిపింది. అయితే, ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను చూస్తే తన క‌ళ్ల‌లో నీళ్లు తిరగ‌డాన్ని చూస్తార‌ని అప్ప‌టి ఓ ఫొటోను పోస్ట్ చేసింది.  
 
ఆ సమయంలో బాధను దాచుకొన్నప్పటికీ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, అందుకు సాక్ష్యం ఈ ఫోటోనే అని రేణుదేశాయ్ ఆ ఫోటోను ట్వీట్ చేసింది. తాను అంతగా భావోద్వేగానికి గురి అవ్వడానికి కారణం త‌న ఫ్రెండ్ మృతి చెంద‌డ‌మేన‌ని తెలిపింది. పుణేలో త‌న‌ స్నేహితురాలు ఓ యాక్సిడెంట్‌లో దుర్మరణం చెందిందని తనకు ఆ ఫోన్ కాల్ వచ్చిందని పేర్కొంది. త‌న‌ బాధను గుండెలోనే పెట్టుకొని షూటింగ్‌లో నటించానని చెప్పింది. తన బాధను ఆపుకోవడం ఓ దశలో తన వల్లకాలేదని ఆమె తెలిపింది.






  • Loading...

More Telugu News