: పవన్‌ కల్యాణ్‌తో కలసి పనిచేస్తామా? లేదా? అనే విషయాన్ని భవిష్యత్‌లో ప్రకటిస్తా: గద్దర్


సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో కలసి పనిచేస్తామా? లేదా? అనే విషయంపై త‌న నిర్ణ‌యాన్ని భ‌విష్య‌త్‌లో ప్ర‌క‌టిస్తాన‌ని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని సుందరయ్య కళా విజ్ఞాన్‌ భవన్‌లో మహా జన సమాజం సదస్సుకు హాజ‌రైన ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. ఇక త్యాగాల తెలంగాణ సాధన కోసం మహాజన సమాజం పోరాటం కొన‌సాగిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. తాము త్వ‌ర‌లోనే జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. భువ‌న‌గిరిలో 10 ల‌క్ష‌ల మందితో ఓ స‌భ నిర్వ‌హిస్తామ‌ని, ఆరు నెలల తర్వాత ఆ సభ ఏర్పాటు చేయాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. తాము ఒక‌ ఉద్యమ సంఘంలా ఉండాలా? లేక ఓ రాజకీయ పార్టీగా ఉండాలా? అనే విషయాన్ని కూడా ఆలోచిస్తానని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News