: బాహుబలి శాండ్ ఆర్ట్ వీడియో అదుర్స్... మీరూ చూడండి!


ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాపై సినీ అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రికొన్ని రోజుల్లో విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప‌ ఎందుకు చంపాడ‌నే అంశంపై ఎన్నో క‌థ‌లు చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలో బాహుబ‌లి అభిమానులను ఆ చిత్ర పోస్ట‌ర్లు అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అయితే, కొంద‌రు అభిమానులు శాండ్ ఆర్ట్ తో బాహుబ‌లి సినిమా సన్నివేశాలు చూపిస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. ముంబైకి చెందిన ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ బాహుబలిపై అభిమానం చాటుకుంటూ ఈ చిత్ర ట్రైలర్ మొత్తాన్ని శాండ్ ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. శ‌ర్వం ప‌టేల్ అద్భుత ప్ర‌తిభ‌కు సెల్యూట్ కొడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.


  • Loading...

More Telugu News