: వారసత్వ రాజకీయాల్లో హరీశ్‌రావు డౌన్ అయ్యారు: జగ్గారెడ్డి
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌లో అంతర్గత పోరు వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో హరీశ్‌రావుది మొదటి నుంచి కీలక పాత్రే అయినప్పటికీ ఆయన వారసత్వ రాజకీయాల్లో డౌన్ అయ్యారని అన్నారు. ఆ పార్టీలో హరీశ్‌రావుకి ఎప్పటికీ అవకాశాలు రావని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. అలాగే తమ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది యోధానుయోధులు ఉన్నారని, కొత్తగా తమ పార్టీలోకి హరీశ్‌రావు వచ్చే అవసరం లేదని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. తమ పార్టీలోకి హరీశ్‌రావు వస్తే ఇక్కడ ఆయన చిన్నవారవుతారని జగ్గారెడ్డి అన్నారు.