: పాఠశాలలోనే హత్యకు గురైన ఉపాధ్యాయురాలు
ఓ ఉపాధ్యాయురాలు తాను పాఠాలు చెబుతోన్న పాఠశాలలోనే హత్యకు గురైన దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మబ్బువాళ్లపేటలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా పాఠశాలలోకి ప్రవేశించిన పలువురు దుండగులు ఆ టీచర్‌ని కత్తితో పొడిచి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మబ్బువాళ్లపేట ప్రాథమిక పాఠశాల వద్దకు చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయురాలు 45 ఏళ్ల ప్రేమకుమారి అని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.