: నంద్యాలలో దారుణం... ఐదురోజులుగా బిక్కుబిక్కుమంటూ ఇంట్లో పిల్లాడు.. నిర్బంధించిన తండ్రి!


కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడిని ఐదురోజుల పాటు కన్న తండ్రే నిర్బంధించిన ఘటన చోటుచేసుకుంది. రెండో భార్య దగ్గరికి వెళ్తూ కొడుకుని ఆ ప్రబుద్ధుడి నిర్బంధించి వెళ్లాడు. ఐదురోజులవుతున్నా ఇంటికి రాకపోవడంతో, బాలుడు బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడిపాడు. దీంతో ఇంటి యజమాని ఆందోళన చెంది, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో శిశుసంక్షేమ శాఖాధికారులతో వచ్చిన పోలీసులు బాలుడిని, రెస్క్యూ హోంకు తరలించారు. బాధ్యతపట్టని తండ్రి గురించి ఆరాతీస్తున్నారు. 

  • Loading...

More Telugu News