: 23 నుంచి ఏపీలోని పాఠశాలలకు సెలవు
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు ఈ నెల 23వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని 301 కరవు మండలాల్లోని విద్యార్థులకు రేషన్ కూపన్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కూపన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 20, 21, 22 తేదీల్లో రేషన్, సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.