: దాడి చూపు ఆ పార్టీ వైపేనా!
తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అలకబూని టీడీపీని వీడిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఏ పార్టీలో చేరతారనే విషయం ఆసక్తికరంగా మారింది. గతంలో మంత్రి గంటాతో సుదీర్ఘంగా భేటీ అయిన దాడికి ఆ సమావేశం పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు కనిపించలేదు. దీంతో, ఆయన చూపు వైఎస్సార్సీపీవైపు మళ్ళినట్టు తెలుస్తోంది. రేపు అనుచరులతో సమావేశమై ఏ పార్టీలో చేరే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలావుంటే, విశాఖ టీడీపీ రూరల్ అధ్యక్షుడు రత్నాకర్ కూడా పదవికి రాజీనామా చేశారు. ఈయన కూడా దాడి వెంట జగన్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.