: జపాన్‌ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు నుంచి పేటీఎంకు భారీగా పెట్టుబడులు


దేశీయ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం.. జపాన్‌కు చెందిన‌ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తోంది. పేటీఎంలో 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల (7,750 కోట్ల రూపాయల నుంచి 9687 కోట్లు రూపాయల వరకు) పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ డీల్ విషయ‌మై జపాన్ సంస్థతో పేటీఎం ప్ర‌తినిధులు సంప్రదింపులు జరిపినట్టు స‌మాచారం. సాఫ్ట్‌బ్యాంకు నుంచి పేటీఎం ఈ పెట్టుబ‌డుల‌ను పొందిన‌ట్ల‌యితే 5 బిలియన్‌ డాలర్ల (రూ.32,293కోట్లకు పైగా) విలువ ఉండే పేటీఎం విలువ 7 బిలియన్ల డాలర్ల(రూ.45,216 కోట్లకు)కు పెరుగుతుంది. ఈ పెట్టుబడులతో పేటీఎం బ్యాంకు సర్వీసుల విస్తరణను మరింత వేగవంతం చేయ‌నున్న‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News