: పాఠశాలలో ‘లఘు, గురువు’ల గురించి బోధించిన డిప్యూటీ సీఎం కడియం!
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ రోజు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి బడి పిల్లలకు పాఠాలు చెప్పారు. పాఠాలంటే ఏదో పైపైన రెండు, మూడు నీతి వాక్యాలు చెప్పి వెళ్లిపోవడం కాదు. తెలుగు గ్రామర్‌లోని చందస్సులో భాగంగా లఘు, గురువుల గురించి ఆయన బోధించారు. వరంగల్ అర్బన్‌లోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో ఆయన పిల్లలకు చెప్పిన ఈ పాఠాలను విన్న ఆ స్కూలు ఉపాధ్యాయులు, ప్రభుత్వాధికారులు సైతం ఆశ్చర్యపోయారు. తెలుగు గ్రామర్ గురించి ఆయన చెప్పిన పాఠం ఆయనకు మన భాషపై ఎంతగా పట్టు ఉందో నిరూపిస్తోంది.