: గవర్నర్, స్పీకర్ వద్దకు స్టాలిన్... పరిస్థితిని తనకు అనువుగా మలచుకునే వ్యూహం!
వెంటనే తమిళనాడు అసెంబ్లీని సమావేశపరచాలని కోరుతూ, డీఎంకే నేత స్టాలిన్ గవర్నర్ ను కలవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో రైతులు పోరాడుతున్న అంశంపై చర్చించాలని, మరోసారి ప్రభుత్వాన్ని బల పరీక్షకు ఆదేశించాలని ఆయన గవర్నర్ ను కోరనున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఏర్పడిన తాజా సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలన్న వ్యూహంతో ఉన్న స్టాలిన్, అందుకు తగ్గట్టుగా, పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అన్నాడీఎంకేలో ముసలంతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు కొందరు తనవైపు వస్తారన్న ఆశ కూడా ఆయనకు ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని స్పీకర్ ను కూడా కోరాలని స్టాలిన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.