: తెనాలిలో ఘోరం...నాలుగు రోజులుగా యువతిపై సామూహిక అత్యాచారం


గుంటూరు జిల్లా తెనాలిలో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే ఘోరం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలంలోని గోపాలపురంకి చెందిన యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు గుంటూరు జిల్లా తెనాలిలోని లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం నాలుగు రోజులుగా ఆ యువతిని లాడ్జిలో బంధించి, ఒకరి తరువాత ఒకరుగా అత్యాచార పర్వం మొదలుపెట్టారు. అయితే లాడ్జి నుంచి, కీచకుల నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే యువతి తప్పించుకోగానే వారు పరారైనట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News