: చెన్నై గోకులం చిట్ ఫండ్ శాఖలపై ఐటీ దాడులు
తమిళనాడులో చాలాకాలంగా చిట్ ఫండ్ సేవలందిస్తున్న గోకులం చిట్ ఫండ్స్ శాఖలపై ఈ ఉదయం ఆదాయపు పన్ను శాఖ అదికారులు దాడులకు దిగారు. పలు ప్రాంతాల్లో ఉన్న 36 శాఖలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఆర్కే నగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున డబ్బులు పంచిన ఆరోపణలు వచ్చిన తరువాత, అధికారుల విచారణలో ఆ డబ్బు గోకులం చిట్ ఫండ్స్ నుంచి వచ్చినట్టు గుర్తించిన మీదటే ఈ దాడులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సివుంది.