: విజయకాంత్ కు కిడ్నీ మార్పిడి అనివార్యం... ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టనున్న భార్య!


డీఎండీకే అధినేత విజయకాంత్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయాలు ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో, డీఎండీకే కూడా చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విజయకాంత్ ఇంటికి, ఆసుపత్రికి మాత్రమే పరిమితమవుతుండటంతో... ఆయన పార్టీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఈ తరుణంలో విజయకాంత్ సతీమణి ప్రేమలతను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు డీఎండీకే వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. మంచి వాక్చాతుర్యం కలిగి ఉండటం... సమయానుకూలంగా స్పందించే తత్వం ప్రేమలతకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో విజయకాంత్ కంటే ప్రేమలతే ఎక్కువ ప్రసంగాలు చేశారు. ఇప్పటి వరకు పార్టీలో ఆమెకు ఎలాంటి పదవి లేనప్పటికీ... విజయకాంత్ వెన్నంటే ఉండి అన్నీ తానై చూసుకుంటున్నారామె. 

  • Loading...

More Telugu News