: తమిళనాట టెన్షన్... సాయంత్రానికి వాయిదా పడిన పన్నీరు సెల్వం విలీనం సమావేశం


తమిళనాడులో మళ్లీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు తమిళనాడు అన్నాడీఎంకే వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి మంత్రి జయకుమార్ ప్రకటన చేస్తూ, అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తరువాత పదిమంది ఎమ్మెల్యేలు దినకరన్ ను కలిశారు. వారంతా పళనిస్వామి, పన్నీరు సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా వారితో కలవమని ప్రకటించారు.

 ఈ నేపథ్యంలో నేటి ఉదయం పన్నీరు సెల్వం వర్గం డీఎంకేలో విలీనమవుతుందని, ఈ మేరకు ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని మీడియాకు సమాచారం అందించారు. పదిమంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పార్టీ అధికారం కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసి, ఆ పదిమంది ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 3 గంటలకు సమావేశం నిర్వహించాలని, ఆతరువాత మీడియా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఈనేపథ్యంలో తమిళనాడులో మరోసారి వేగంగా మారుతున్న పరిణామాలు ఆసక్తితోపాటు టెన్షన్ పుట్టిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News