: దినకరన్ ప్రయత్నాలు విఫలం.. ములాఖత్‌కు శశికళ విముఖత!
అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శశికళ దినకరన్‌ను కలుసుకునేందుకు విముఖత చూపినట్టు తెలుస్తోంది. పార్టీలో వేగంగా మారుతున్న పరిణామాలు, ఐటీ దాడులు, ఢిల్లీ పోలీసుల కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దినకరన్ జైలులో ఉన్న చిన్నమ్మను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. శశికళను కలుసుకునేందుకు సోమవారం ఉదయం దినకరన్ బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన శశికళను కలుసుకోవాల్సి ఉంది. అయితే సాయంత్రమైనా ఆయన జైలుకు రాలేదు. సాయంత్రం 5.30 గంటలకు దినకరన్ వస్తారని ఆయన అనుచరులు జైలు అధికారులకు చెప్పడంతో వారు అంగీకరించారు. అయితే ఆ సమయానికి కూడా ఆయన రాలేదు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ లగ్జరీ కారు రెండుసార్లు జైలు వద్దకు వచ్చి చక్కర్లు కొట్టిందని, అందులో దినకరన్ వచ్చి ఉంటారని చెబుతున్నారు. అయితే చిన్నమ్మ కావాలనే దినకరన్‌ను కలుసుకోలేదని, ప్రస్తుత పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే దినకరన్‌తో ములాఖత్‌కు నో చెప్పినట్టు సమాచారం.