: మహిళా కండక్టర్లకు కరాటేలో శిక్షణ: ఏకే ఖాన్
దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 16న జరిగిన అత్యాచార ఘటన పలు శాఖలను
అప్రమత్తం చేస్తోంది. కార్యాలయాల్లో పని చేసే మహిళలకు భద్రత కలిగించేందుకు, వారిని
వారు కాపాడుకునేందుకు ప్రభుత్వం నూతన ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్టీసీ
కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఆర్టీసీ మహిళా కండక్టర్లకు కరాటేలో
ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఎండీ ఏకే ఖాన్ హైదరాబాదులో తెలిపారు. దీంతో పాటు బస్సుల్లో ఈవ్ టీజింగ్ పై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంచితే, ఇప్పట్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఖాన్ స్పష్టం చేశారు. మరోపక్క డీజిల్ భారం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాన్ని వ్యాట్, మోటార్ వెహికల్ పన్ను నుంచి మినహాయింపు కోరినట్లు వివరించారు. క్రీడాకారులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.