: తల్లికి క్రికెట్ బంతి తగిలిందని యువకుడిని కత్తితో పొడిచేశాడు!
తన తల్లికి క్రికెట్ బంతి తగిలిందనే కోపంతో ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. సదరు మహిళకు క్షమాపణలు చెప్పేందుకు వచ్చిన యువకుడిని కత్తితో పొడిచిన దారుణ సంఘటన విజయవాడలోని పీఎన్టీ క్వార్టర్స్ లో జరిగింది. క్వార్టర్స్ లో యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి వెళ్లి ఓ మహిళకు తగిలింది. దీంతో, ఆ మహిళకు క్షమాపణలు చెప్పేందుకు యువకుడు కిరణ్ వెళ్లాడు. అయితే, ఆ సమయంలో సదరు మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో కిరణ్ పై అతను కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.