: లెనోవా స్మార్ట్‌ఫోన్లపై ప్లిప్‌కార్ట్‌లో రెండు రోజుల బంప‌ర్ ఆఫ‌ర్లు


లెనోవా స్మార్ట్‌ఫోన్లపై ప్లిప్‌కార్ట్‌ రెండు రోజుల బంప‌ర్ ఆఫ‌ర్లను ప్ర‌క‌టించింది. ఈ రోజు, రేపు ఈ డిస్కౌంట్‌ ధరలు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. లెనోవాతో తమ భాగస్వామ్యం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా దాదాపు 24 ఉత్పత్తులపై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల‌తో పాటు టాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్ వంటి ఎల‌క్ట్రానిక్స్ ప‌రికరాల‌ను కూడా అందిస్తోంది.

ఈ ఆఫ‌ర్ల‌లో భాగంగా అందిస్తున్న ప్ర‌యోజ‌నాలు..
* లెనోవా కె 5 అన్ని  మోడల్స్‌పై రూ.1000 తగ్గింపు
* లెనోవా పీ2- 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై రూ.3వేల డిస్కౌంట్‌ ఆఫర్ (రూ. 13,999 లకే కొనుగోలు చేయ‌వ‌చ్చు)
* 4జీ 32 జీబీ స్టోరేజ్‌పై రూ.2వేల తగ్గింపు (రూ.15,999కే కొనుగోలు చేయ‌వ‌చ్చు)
* యోగా ట్యాబ్‌ 3, 64  జీబీ  వేరియంట్‌పై సుమారు నాలుగువేల డిస్కౌంట్ (రూ.39,900 లకే కొనుగోలు చేయ‌వ‌చ్చు)

అంతేగాక‌, మరిన్ని లెనోవా ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. పూర్తి  వివరాలకోసం ప్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చు.

  • Loading...

More Telugu News