: దళిత మంత్రులతో శివప్రసాద్ ను చంద్రబాబు తిట్టిస్తుండటం దారుణం: భూమన
ఎంపీ శివప్రసాద్ ను దళిత మంత్రులతో సీఎం చంద్రబాబు తిట్టిస్తుండటం దారుణమని వైఎస్సార్సీపీ ఎంపీ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళిత మంత్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంపీ శివప్రసాద్ ప్రశ్నించడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఓ దళిత ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సీఎం, ఈ విధంగా ప్రవర్తిస్తుండటం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబుకు శివప్రసాద్ స్నేహితుడు, శ్రేయోభిలాషి అని అన్నారు. కేవలం శివప్రసాద్ మాత్రమే కాకుండా, ఆ పార్టీ నేతలు అయిన బోండా ఉమ, బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా ప్రశ్నిస్తున్నారని, వారికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.