: ముగ్గురు కృష్ణా జిల్లా నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీడీపీ అధిష్ఠానం


కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు నేతలకు టీడీపీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండల సంస్థాగత ఎన్నికల సమయంలో క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడ్డారంటూ... ఉయ్యూరు ఏఎంసీ ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, ఉయ్యూరు మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల శ్రీనివాస్ బాబు, ఉయ్యూరు టౌన్ వార్డు కమిటీ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాస్ లకు నోటీసులు జారీ అయ్యాయి. ఏడు రోజుల్లోగా నోటీసులకు సంజాయషీ ఇవ్వాలంటూ పార్టీ ఆదేశించింది. 

  • Loading...

More Telugu News