: మాంసాహారమే కాదు.. శాకాహారమూ కల్తీ.. నిన్నటి అన్నం వడ్డించేస్తున్నారు!
హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగ అధికారులు కొన్ని రోజులుగా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కొరడా ఝుళిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను ఇప్పటికే మూయించారు. ఈ రోజు నగరంలోని వనస్థలిపురంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో అధికారులు సోదాలు చేయగా అందులో కుళ్లిన టమాటాలు, నిన్నటి అన్నం కనిపించింది. అవి చెత్తకుప్పలో పారేయడానికి సిద్ధంగా ఉన్న పదార్ధాలు కావు. తమ కస్టమర్లకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆ హోటల్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. మరోవైపు హోటల్ పాపడమ్స్‌లోనూ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినందుకు రూ.5 వేల జరిమానా వేశారు.