: పొలంలో నుంచి వస్తున్న పొగ మంటలు.. బాలుడు మృతి


కర్ణాటక లోని మైసూరు శివార్లలో ఉన్న శాదనహళ్లి గ్రామంలోని ఓ పొలంలో పొగలు, మంటలు వస్తున్నాయి. సోమన్న అనే ఓ రైతుకు చెందిన 20 సెంట్ల భూమిలో ఈ విచిత్రం జరుగుతోంది. ఆ ప్రదేశంలో ఏది వేసినా వెంటనే కరిగిపోతోంది. ఇనుప కడ్డీలు సైతం కరిగిపోతుండటంతో స్థానికులు భయపడుతున్నారు. నీరు చల్లినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో, అదే గ్రామానికి చెందిన బాలుడు బహిర్భూమికి వెళ్లి, ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడు. దీంతో, అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. ఈ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. మరో వైపు ఈ స్థలాన్ని పరీక్షించేందుకు జియాలజిస్టులు ఆ ప్రాంతానికి పరుగులు పెడుతున్నారు. అయితే, మైసూరులోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్ ప్రెస్ నుంచి రసాయన వ్యర్థాలను వేయడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. 

  • Loading...

More Telugu News