: కర్ణాటకలో ముందస్తు ఎన్నికలు?


కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ తోసి పుచ్చుతున్నా.... బీజేపీ, జేడీఎస్ సీనియర్ నేతలు మాత్రం దీనికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఏకకాలంలో గుజరాత్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే దిశగా బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ ఎన్నికలు జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య జరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇప్పటికే తన సొంత రాష్ట్రం గుజరాత్ పై ఫోకస్ చేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళితే... మూడు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించడం మోదీకి కష్టమవుతుందనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. ఇటీవల రెండు స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం... ఆ పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దీంతో, ముందస్తుకు వెళితే కాంగ్రెస్ కే లాభమంటూ ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News