: జాతీయ గీతానికి మర్యాద ఇవ్వాలని మర్చిపోయిన ట్రంప్... గుర్తు చేసిన మెలానియా ట్రంప్.. వీడియో చూడండి


డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ చిక్కుకున్నన్ని వివాదాల్లో చిక్కుకున్న మనిషి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈసారి ఏకంగా ఆయన జాతీయగీతానికి గౌరవం ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోవడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఈస్టర్ ను పురస్కరించుకుని వైట్ హౌస్ ఎగ్ రోల్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జాతీయగీతం ఆలపిస్తారు. ఆ సమయంలో హుషారుగా ఉన్న ట్రంప్ జాతీయగీతం ప్రారంభమైన తరువాత గుండె మీద చెయ్యి పెట్టడం మర్చిపోయారు. అమెరికాలో జాతీయగీతం వస్తున్న సమయంలో గుండెలపై చెయ్యి వెయ్యాలి. ప్రారంభమైన వెంటనే ప్రక్కనే ఉన్న మెలానియా ట్రంప్ తన చేతితో ట్రంప్ చేతిని తట్టడం ద్వారా గుర్తు చేశారు. దీంతో వెంటనే ట్రంప్ చేతిని గుండెలమీద పెట్టారు. ఇది ఇప్పుడు అమెరికాలో పెను దుమారం రేగుతోంది. దేశాధ్యక్షుడికి విదేశీ వనిత జాతీయగీతానికి గౌరవం ఇవ్వడం నేర్పిందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.


  • Loading...

More Telugu News