: చంద్రబాబు కోసం ఆగిన దేవినేని నెహ్రూ అంత్యక్రియలు!


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుణదలలోని దేవినేని నెహ్రూ వ్యవసాయ క్షేత్రానికి రావడం ఆలస్యం కావడంతో ఆయన అంత్యక్రియలు సుమారు 25 నిమిషాల పాటు ఆలస్యం అయ్యాయి. చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో, అంత్యక్రియల ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న దేవినేని అనుచరులను పంపించి వేశారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీల అనంతరం, చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు. ఇంటి నుంచి గుణదలకు రావడానికి చంద్రబాబు కాన్వాయ్ కి కొంత సమయం పట్టినందున, ఆయన వచ్చే వరకూ అంత్యక్రియలను ఆపినట్టు తెలుస్తోంది. మరికొన్ని నిమిషాల్లో దేవినేని పార్థివదేహం అనంత వాయువుల్లో కలవనుంది.

  • Loading...

More Telugu News