: అరెస్ట్ ను తప్పించుకునేందుకు దినకరన్ ప్రయత్నాలు!


ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించి, ఆపై అరెస్ట్ చేస్తారని భావిస్తున్న శశికళ అక్క కొడుకు దినకరన్, జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఉదయం పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను కలిసేందుకు బెంగళూరుకు బయలుదేరిన ఆయన, అంతకుముందు పలువురు న్యాయవాదులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ నేడు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని న్యాయవాదులు భావిస్తున్నట్టు సమాచారం. ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తును తమకు కేటాయిస్తే, ఎన్నికల కమిషన్ కు రూ. 60 కోట్ల వరకూ లంచం ఇచ్చేందుకు దినకరన్ సిద్ధపడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News