: షార్జా నుంచి కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్


తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ ను బలంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ నేత కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గత వారం రోజులుగా, అర్ధరాత్రి సమయంలో చంపేస్తామంటూ హెచ్చరికలు వస్తుండడంతో కిషన్ రెడ్డి, నారాయణ గూడ, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆరాతీసిన పోలీసులు ఆ ఫోన్ కాల్స్ షార్జా నుంచి వస్తున్నట్టు గుర్తించారు. కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ ఈ ఫోన్ కాల్స్ లో బెదిరిస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ కిషన్ రెడ్డి నివాసం, కార్యాలయానికి కూడా వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ముస్లిం రిజర్వేషన్ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News