: దర్శకుడు మణిరత్నం ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా: లైట్ మ్యాన్ హెచ్చరికలు


ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని సినిమా లైట్‌ మ్యాన్‌ ఒకరు బెదిరించడం కోలీవుడ్‌ లో కలకలం రేపుతోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటగా మణిరత్నం 'గురు' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లైట్ మ్యాన్ గా మణిమారన్ పని చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మణిమారన్ రక్తసంబంధ వ్యాధికి గురయ్యాడు. అయితే తన వైద్య ఖర్చులకు లైట్‌ మ్యాన్‌ సంఘం, మణిరత్నం, 'గురు' చిత్ర యూనిట్‌ ఎలాంటి సహాయం చేయలేదని, పదేళ్లుగా తన కుటుంబ సభ్యులే తన వైద్య ఖర్చులు భరిస్తున్నారని, తనకు రావాల్సిన డబ్బు ఇప్పించలేకపోతే మణిరత్నం నివాసం ముందే ఆత్మహత్యకు పాల్పడతానని ఆయన హెచ్చరించారు.

దీనిపై తన లైట్‌ మ్యాన్‌ సంఘంపై కోర్టులో పోరాడి విజయం సాధించినా తనకు రావాల్సిన 2 లక్షల రూపాయలు చెల్లించలేదని, దీని గురించి అడిగితే సంఘ కార్యదర్శి రామన్‌ 20 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News