: కాసేపట్లో ప్రారంభం కానున్న దేవినేని నెహ్రూ అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తెల్లవారు జామున హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమ తదితరులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా, మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయవాడ, గుణదలలోని నివాసంలో నెహ్రూ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పలువురు అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.