: తొలి బంతికే పడిన వికెట్... చిన్నపిల్లాడైపోయిన సినీ అగ్ర నటుడు వెంకటేష్!


హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 19వ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 159 పరుగులు చేసింది. దీంతో 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎదుర్కొన్న తొలి బంతికే భువనేశ్వర్ కుమార్ షాక్ ఇచ్చాడు. టోర్నీలో ఆకట్టుకున్న సఫారీ సీనియర్ ఆటగాడు హషీమ్ ఆమ్లాను డక్కౌట్ చేశాడు.

దీంతో వీఐపీ గ్యాలరీలో కూర్చున్న టాలీవుడ్ ఆగ్రనటుల్లో ఒకడైన విక్టరీ వెంకటేష్ చిన్నపిల్లాడైపోయాడు. ఔట్ కాగానే సీట్లోంచి లేచిన వెంకీ చీర్స్ చెబుతూ అభిమానులను అలరించాడు.  స్టేడియంలోని భారీ స్క్రీన్స్ పై వెంకటేష్ కనిపించగానే అభిమానులు కేరింతలు కొట్టారు. వెంకీ హైదరాబాదుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు. కాగా, వెంకీ క్రికెట్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిన వెంకీ క్రికెట్ బాగా ఆడతాడని, టాలీవుడ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News