: సన్నీ లియోన్ యాడ్ చూస్తే కంపరమెత్తుతోంది: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగం
ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇటీవల నటించిన ఓ కండోమ్ యాడ్ పట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) మహిళా విభాగం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సన్నీ నటించిన యాడ్ మహిళలను అత్యంత దారుణంగా చిత్రీకరించే విధంగా ఉందని వారు మండిపడ్డారు. టీవీల్లో ఈ యాడ్ ను చూడడం చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. చాలా అసభ్యకరంగా, తప్పుడు సందేశాన్ని తెలియజేసేలా ఉన్న ఈ యాడ్ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాడ్ ను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.