: లోకేష్ కు స్వాగతం ప్లెక్సీలు కడుతుండగా అపశ్రుతి... టీడీపీ యువ కార్యకర్తకు కరెంట్ షాక్
తన తొలి అధికారిక పర్యటన నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేష్ రానున్న వేళ అపశ్రుతి చోటు చేసుకుంది. కాకినాడలో లోకేష్ కు స్వాగతం పలుకుతూ, ప్లెక్సీలు కడుతుండగా, కరెంట్ షాక్ తో ఓ టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ కరెంట్ పోల్ కు ప్లెక్సీని కడుతున్న వేళ, ప్రమాదవశాత్తూ తీగలు తగిలినట్టు సమాచారం. గాయపడిన యువకుడి పేరు అనిల్ కుమార్ అని గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.