: మైదుకూరు బయో గ్యాస్ ప్లాంటులో తీవ్ర ప్రమాదం.. ముగ్గురు కార్మికుల మృతి


వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైదుకూరులో నేడు ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి బయోగ్యాస్ ప్లాంటు బాయిలర్ లో ప్రమాదవశాత్తూ పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక కార్మికుడికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. బాయిలర్ లో పడి మరణించిన వారు ప్రసాద్ రెడ్డి, ఆంజనేయులు, రాముడిగా గుర్తించారు. ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News