: లంచం ఇవ్వలేదు, సుఖేష్ అనే పేరు కూడా వినలేదు: టీటీవీ దినకరన్


అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్ కు లంచం ఇవ్వజూపి, ఓ మధ్యవర్తిని కుదుర్చుకున్నాడని వచ్చిన ఆరోపణలపై టీటీవీ దినకరన్ స్పందించారు. "ఆ పేరుతో ఒకరున్నారని కూడా నాకు తెలియదు. సుఖేష్ చంద్రశేఖర్ అనే పేరును నేను వినలేదు. నేను ఎవరికీ లంచం ఇవ్వలేదు. ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు వస్తే, చట్టపరంగా ఎదుర్కొంటాను" అని తనను కలిసిన మీడియాతో దినకరన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారించేందుకు చెన్నై బయలుదేరారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News