: దేవినేని నెహ్రూ మరణంపై నటుడు మోహన్ బాబు స్పందన


మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల నటుడు మోహన్ బాబు స్పందించారు. తనకున్న ఆప్త మిత్రుల్లో నెహ్రూ ఒకరని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తనకు బాధను కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు షిర్డీ సాయిబాబా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, దేవినేని నెహ్రూ మరణం రాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటని, తాను ఆయన్ను మరచిపోలేనని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News