: దేవినేని మరణంపై స్పందించిన రాంగోపాల్ వర్మ
తన తాజా చిత్రం 'వంగవీటి'లో ఓ హీరో అయిన దేవినేని నెహ్రూ మరణంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ ఉదయం 10:20 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "నెహ్రూ మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో నేను గడిపిన అద్భుత సమయాన్ని గుర్తు చేసుకుంటున్నా. బలమైన నేరారోపణలతో కూడిన శక్తికి ఆయన చిహ్నం" అని అన్నారు. కాగా, ఈ తెల్లవారుజామున గుండెపోటుతో దేవినేని నెహ్రూ మరణించిన సంగతి తెలిసిందే.
Shocked to hear about Devineni Nehru Garu's death .A symbol of strength with strong convictions ..Remembering my wonderful memories with him
— Ram Gopal Varma (@RGVzoomin) 17 April 2017