: బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ లు.. ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా దాడులు!


విజయవాడ వన్ టౌన్ లో ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది.. దాడులకు తెగబడుతోంది. అయితే, ‘బ్లేడ్ బ్యాచ్’ బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. సరైన చర్యలు చేపట్టకపోవడంతో ‘బ్లేడ్ బ్యాచ్’ ఆగడాలు నగరమంతా విస్తరిస్తాయనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గంజాయి, మద్యానికి బానిసలు అయిన యువకులే బ్లేడ్ బ్యాచ్ గా తయారవుతున్నారు. వన్ టౌన్ లోనే వీరు ఆశ్రయం పొందుతుండటంతో ఈ ప్రాంతంలోనే వీరి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్, బస్టాండ్, కాళేశ్వరరావు మార్కెట్ తదితర ప్రాంతాలకు ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్నారు. బ్లేడ్ తో బెదిరించి డబ్బు దోచుకోవడమే కాకుండా, గాయపరుస్తున్నారు కూడా. కొన్ని సందర్భాల్లో వారికి వారే బ్లేడ్ తో కోసుకుని ఎదుటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గుణదల, గాంధీనగరం, భవానీపురం, కృష్ణ లంక, తదితర ప్రాంతాల్లోనూ బ్లేడ్ బ్యాచ్ లు రెచ్చిపోతున్న ఘటనలు లేకపోలేదు.

  • Loading...

More Telugu News