: రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం.. అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ దినకరన్ పై కేసు నమోదు!
అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్ దినకరన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలపై ఢిల్లీ క్రైం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన మధ్యవర్తి చంద్రశేఖర్ ద్వారా కోటి ముప్ఫై లక్షల రూపాయలు లంచంగా ఇచ్చేందుకు దినకరన్ ప్రయత్నించారు. చంద్రశేఖర్ ఇచ్చిన వివరాల మేరకు దినకరన్ పై ఢిల్లీ క్రైమ్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.