: శివప్రసాద్! మరోమారు, చంద్రబాబుని విమర్శిస్తే నీ బండారం బయట పెడతా: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. శివప్రసాద్ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. శివప్రసాద్ ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, పార్టీ మారాలంటే మారిపోవచ్చని, దళితులను అడ్డం పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు. మరోసారి చంద్రబాబును కనుక విమర్శిస్తే, తిరుమలకు వెళ్లి శివప్రసాద్ బండారం బయటపెడతానని హెచ్చరించారు. దళితులకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత టీడీపీ ఇచ్చిందని చెప్పిన ఆయన, ఈ సందర్భంగా బాలయోగి, ప్రతిభా భారతి పేర్లను ప్రస్తావించారు.