: రెండు రోజుల్లో ‘మహానాడు’ వేదిక ఖరారు చేస్తాం: మంత్రి కళా వెంకట్రావు


మరో రెండు రోజుల్లో ‘మహానాడు’ వేదికను ఖరారు చేస్తామని ఏపీ మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై జరుగుతున్న గొడవలపై ఆయన స్పందిస్తూ త్వరలోనే సద్దుమణుగుతాయన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27వ తేదీన ‘మహానాడు’ నిర్వహించడం ఆనవాయతి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి నిర్వహించే పార్టీ కార్యక్రమం ఇది.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, ఎజెండాలను, పలు సమస్యలపై పార్టీ తీర్మానాలను ప్రకటిస్తారు. ‘మహానాడు’కు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరవుతారు.

  • Loading...

More Telugu News