: ‘బాహుబలి’లో నా రోల్ కాకుండా ఆ పాత్ర అంటే ఇష్టం: హీరో ప్రభాస్


‘బాహుబలి’ చిత్రంలో తన రోల్ కాకుండా శివగామి పాత్ర అంటే తనకు ఇష్టమని హీరో ప్రభాస్ చెప్పాడు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘‘బాహుబలి-1’లో శివగామి పాత్ర అల్టిమేట్. పవర్ ఫుల్ రోల్.. ‘పవర్ ఆఫ్ విమన్’. అలాగే, కట్టప్ప పాత్ర తక్కువేమీ కాదు. ‘బాహుబలి-2’లో కట్టప్ప ఎలా చేస్తాడో చూస్తారు. ‘బాహుబలి’ని పర్సనల్ గా అందరూ సొంతం చేసేసుకున్నారు. తెలుగు, తమిళం..అని లేదు. ‘బాహుబలి’ని ఇండియన్ సినిమా అని అందరూ ఫీలవుతున్నారు. సినిమా ఏ భాషలో నైనా సరే, మ్యాజిక్ చేయగలదు అని చెప్పడానికి నిదర్శనం ‘బాహుబలి’’ అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ నెల 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News