: ఆ రోజున నన్ను చూసి నవ్వారు.. ఈ రోజున నవ్విన నాప చేనే పండింది: సీఎం కేసీఆర్


ఆ రోజున తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేపట్టిన తనను చూసి చాలా మంది నవ్వారని, కానీ, ఈ రోజున నవ్విన నాప చేనే పండిందని సీఎం కేసీఆర్ అన్నారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ బిల్లు అంశంపై తెలంగాణ అసెంబ్లీ ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా గిరిజన, మైనార్టీ రిజర్వేషన్ బిల్లును కేసీఆర్ ప్రవేశపెట్టారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, ‘ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల పెంపు బిల్లు తీసుకువచ్చాం. ఈ రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు. బీసీ కమిషన్ నివేదిక తర్వాత బీసీల రిజర్వేషన్లు పెంచుతాం. ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నాము. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రానికే అధికారాలు ఇవ్వాలి. మేం మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం లేదు. సామాజిక వెనుకబాటు ఆధారగానే రిజర్వేషన్ కల్పిస్తాం. రిజర్వేషన్ బిల్లు లోక్ సభ ముందుకు రాకపోతే కేంద్రాన్ని నిలదీస్తాం. అవసరమైతే, లోక్ సభలో గొడవ చేస్తాం’ అని కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News