: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... మెరుగుపడ్డ ప్రభుత్వ కళాశాలలు


వీరిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,75,874 మంది హాజరు కాగా, 2,70,738 మంది పాస్ అయ్యారు. 57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత 6 శాతం పెరిగిందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రెండో సంవత్సరం పరీక్షలకు 4,11,213 మంది హాజరు కాగా, 2,75,273 మంది (66.45 శాతం) ఉత్తీర్ణులయ్యారని, గత సంవత్సరంతో పోలిస్తే, ఇది 3 శాతం అధికమని తెలిపారు. ఎప్పటిలోలాగానే బాలికలదే పైచేయని, ఫస్టియర్ లో 63 శాతం మంది బాలికలు, సెకండ్ ఇయర్ లో 71 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు.

ఫస్టియర్ ఏ గ్రేడ్ లో 50 శాతం, సెకండియర్ ఏ గ్రేడ్ లో 53 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ పరీక్షల్లో మేడ్చల్ జిల్లా ఉత్తీర్ణతలో ప్రథమ స్థానంలో నిలువగా, రంగారెడ్డి రెండో స్థానంలో, చివరి ప్లేస్ లో మెహబూబాబాద్, నిర్మల్ జిల్లాలున్నాయని కడియం తెలియజేశారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగిందని, ఈ సంవత్సరం ఫస్టియర్ లో 47 శాతం, సెకండియర్ లో 65 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు పాసయ్యారని వెల్లడించారు. ఈ సంవత్సరం గిరిజన పాఠశాలల్లో మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గిందని, ఫస్టియర్ లో 61 శాతం, సెకండియర్ లో 69 శాతం మంది ప్రైవేటు విద్యార్థులు పాస్ అయ్యారని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News