: జూబ్లీహిల్స్ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన ఐఆర్ఎస్ అధికారి తరుణ్ రెడ్డి
జంటనగరాల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు డ్రంకెన్ డ్రైవ్ కేసులు చెబుతున్నప్పటికీ, ఇంకా కొంతమంది అప్పుడప్పుడూ అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. వారిలో విద్యాధికులు, ప్రభుత్వ అధికారులు కూడా ఉండటం గమనార్హం. తాజాగా, నిన్న రాత్రి జూబ్సీహిల్స్ లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, సివిల్స్ లో 488 ర్యాంకు సాధించి ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వరంగల్ కు చెందిన గంగిరెడ్డి తరుణ్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయనకు శ్వాస పరీక్షలు నిర్వహించగా, మోతాదుకు మించి మద్యం తాగినట్టు తేలింది. దీంతో ఆయన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, సోమవారం నాడు ఆయనకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు.